ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో అరుదైన ఘనత! (వీడియో)

by Ramesh Goud |
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో అరుదైన ఘనత! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చిమ్మ చీకట్లో విమానాన్ని సురక్షితంగా దింపి మరో అరుదైన ఘటతను సాధించింది. తూర్పు సెక్టార్ లో నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి ట్రాన్స్ పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఈ ఫీట్ కు సంబందించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోల్లో నైట్ విజన్ టెక్నాలజీ సాయంతో అదునాతన గ్రౌండ్ లో ఐఏఎఫ్ C-130J విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా చూపిస్తుంది. నైట్ విజన్ గాగుల్స్ కారణంగా చీకటిలో ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. విమానం లోపలి నుంచి ఎలా ఉందో మరో వీడియోలో కనిపించింది.

దీనిపై మరో ముఖ్యమైన మైలురాయిని అందుకుంటూ ఐఏఎఫ్ C-130J విమానం తూర్పు సెక్టార్ లోని అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లో నైట్ విజన్ గాగుల్స్ సహాయంతో విజయవంతంగా ల్యాండింగ్ జరిగిందని తెలిపింది. అంతేగాక ఐఏఎఫ్ తన సామర్థ్యాలను విస్తరిస్తూనే.. కార్యచరణ పరిధిని రక్షణ సంసిద్దతను పెంపొందించడం ద్వారా దేశ సార్వభైమత్వాన్ని కాపాడే నిబద్దతను బలోపేతం చేస్తుందని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఒకసారి నియంత్రణ రేఖ వద్ద చీకటిలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పడు నైట్ విజన్ గాగుల్స్ సాయంతో ల్యాండ్ అయ్యి మరో అరుదైన ఫిట్ సాధించినట్టు అయ్యింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్, టేక్ ఆఫ్ కావడంలో C-130J ఎయిర్ క్రాఫ్ట్ ప్రతేకత కలిగి ఉంది.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed