- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్టెతో ఇద్దరు కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని దుండగుల దాడి..
ఓ గుర్తు తెలియని దుండగుల చేత ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు.

దిశ, భిక్కనూరు: బైకు తాళం, మా సెల్ ఫోన్లు గుంజుకొని స్టేషన్‌కు రమ్మంటారా...? మేము ఎవరో తెలుసా... మా దగ్గర గన్ ఉంది అంటూ ఇద్దరు కానిస్టేబుళ్లను బెదిరించి, ఎడాపెడా చెంపల మీద వాయించి, కిందపడేసి కట్టెతో కానిస్టేబుళ్లలను కొట్టారు. అంతేకాకుండా అడ్డుకోబోయిన దాబా యజమానితో పాటు, మరొక వ్యక్తిపై దాడి చేసి గుర్తు తెలియని దుండగులు ఎస్కేప్ అయిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్ సమీపంలో ఉన్న 44వ హైవేపై రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బైక్ పై హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని దుండగులు (బైక్ నంబర్ ప్లేట్ కనబడకుండా బట్ట కట్టారు) సమీపంలోని హైవేపై నీళ్ల బాటిల్ కావాలంటూ బైకు ఆపి, రెండు రోజుల క్రితం దాబాలోకి వచ్చారు. అప్పటికి అర్ధరాత్రి 12 అవుతుండడంతో దాబా యజమాని నీళ్ల బాటిల్ కాదు కదా ఏ వస్తువు కూడా ఇవ్వలేనని, పోలీసులు వచ్చి ఫోటో తీస్తే మాకు పెద్ద మొత్తంలో ఫైన్ పడుతుందని నచ్ జెప్పాడు.
తప్పుడు ఫిర్యాదు చేసిన దుండగులు..
అంతలోనే ఒక దుండగుడు బైక్ పార్కింగ్ చేసిన స్థలానికి వెళ్లి 100 డయల్‌కు ఫోన్ చేసి 500 రూపాయలు తీసుకొని నీళ్ల బాటిల్ ఇవ్వడం లేదంటూ తప్పుడు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసులు దాబా వద్దకు చేరుకున్నారు. ఎందుకు అలా చేశావని దాబా యజమానిని పోలీసులు ప్రశ్నించగా, వారు చెప్పిందంతా అబద్ధమని కావాలంటే తన దాబాలో ఉన్న నాలుగు సీసీ ఫుటేజ్ లను పరిశీలించాలని సూచించారు. దీంతో తప్పుడు ఫిర్యాదు చేసిన దుండగులు... పొరపాటు అయ్యిందని, తన వద్దే ఉన్నాయని తడబడుతూ సమాధానం చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బైకు తాళంతో పాటు వారి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను పోలీసులు గుంజుకొని జేబులో పెట్టుకోగా, మేము ఎవరో తెలుసా... మా వద్ద గన్ ఉందంటూ దంకీ ఇవ్వడమే కాకుండా, కానిస్టేబుల్ చెంపలు ఎడాపెడ వాయించాడు. అంతటితో ఊరుకోకుండా మరో కానిస్టేబుల్ పై కూడా దాడికి దిగాడు.
కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు..
కానిస్టేబుళ్లను దొడ్డు కట్టేతో కిందపడేసి... కొట్టగా మమ్మల్ని కాపాడాలంటూ అరుపులు, కేకలు పెట్టారు. దీంతో దాబా యజమానితో పాటు, పక్కనే ఉన్న మరో షాపు యజమాని దొడ్డు కట్టెలను పట్టుకొని వచ్చి పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడిలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా, దాబా యజమాని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చివరకు దుండగులు తప్పించుకొని ఘటన స్థలం నుంచి పరార్ అయ్యారు. దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా రామయంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి అదే రాత్రి షిఫ్ట్ చేశారు. దాడి చేసి పరారైన దుండగుల కోసం అటు సుచిత్ర సర్కిల్ వరకు, ఇటు మెదక్ జిల్లా గజ్వేల్ వరకు పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరుసటి రోజు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించి ఒక దుండగున్ని పోలీసులు పట్టుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం బయటపడకుండా పోలీసులు సీక్రెట్‌గా ఉంచారు.






