చిరంజీవి సినిమాను తలపించిన సూసైడ్.. ఫ్రెండ్ కోసం చనిపోయాడు

by Web Desk |
చిరంజీవి సినిమాను తలపించిన సూసైడ్.. ఫ్రెండ్ కోసం చనిపోయాడు
X

దిశ, బాల్కొండ: ఫ్రెండ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ఏకంగా ప్రాణాలు సైతం వదులుకోవడం సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో సరిగ్గా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్‌ కాలనీలో నివాసముండే తిమ్మాన శ్రీనివాస్(31), కంచు రవి(31) ఇద్దరు ప్రాణ స్నేహితులు. కాలనీలో పాల డెయిరీ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత 15 రోజుల క్రితం కరోనా మహమ్మారి సోకి శ్రీనివాస్ మృతిచెందాడు. అప్పటి నుంచి స్నేహితుడి మృతిని తట్టుకోలేక రవి మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో దులానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఏడాది కూతురు ఉంది. మెండోరా ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, సరిగ్గా ఇలాగే స్నేహంకోసం సినిమాలో చిరంజీవి మరణాన్ని తట్టుకోలేక, అతని స్నేహితుడు విజయ్ కుమార్ మరణించడం మనం చూశాం.


Next Story

Most Viewed