- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందూరు జర్నలిస్టుల విలక్షణ తీర్పు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సమాజాన్ని చైతన్య పరచడంలో ముందు వరసలో ఉండే జర్నలిస్టులు ఇందూరు లో ఈసారి తమ చైతన్య స్ఫూర్తిని చాటారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సమాజాన్ని చైతన్య పరచడంలో ముందు వరసలో ఉండే జర్నలిస్టులు ఇందూరు లో ఈసారి తమ చైతన్య స్ఫూర్తిని చాటారు. మంగళవారం జరిగిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో 245 మంది జర్నలిస్టులు తమ బ్యాలెట్ పవర్ తో విలక్షణ మైన తీర్పునిచ్చారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో ఎవరి ఊహకందని రీతిలో బ్యాలెట్ అస్త్రాన్ని సంధించారు. అందరూ కోరు కుంటున్న మార్పు వనానికి నాణ్యమైన బీజాన్ని నాటారు. పాత కార్యవర్గానికి పాతరేసి, కొత్త కార్యవర్గానికి జీవం పోశారు.
చరిత్ర సృష్టించిన ప్రెస్ క్లబ్..
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ చరిత్రలో ఏనాడు కనీవినీ ఎరుగని రీతిలో కలం యోధులు ఇచ్చిన తీర్పుకు, ప్రదర్శించిన చైతన్యస్ఫూర్తిని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఎక్కడ చూసినా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలు గురించే చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల్లో విజేతలు ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..?
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్ తన సమీప ప్రత్యర్థి తాజా మాజీ అధ్యక్షుడు అంతడ్పుల రామకృష్ణపై 124 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాంత్ కు 176 ఓట్లు రాగా, రామకృష్ణకు 52 ఓట్లు వచ్చాయి. పోటీలో ఉన్న మరో అభ్యర్థి కత్తుల రాజేష్ కు 13 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కార్యవర్గంలోని మిగతా పోస్టుల్లో..
ఉపాధ్యక్షులుగా బైస సంగీత 100 ఓట్లు సాధించి అత్యధిక ఓట్లు సాధించిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు. సతీష్ గౌడ్ 95 ఓట్లు, జెట్లీ గోవిందరాజ్ 79 ఓట్లు సాధించి ఉపాధ్యక్షులుగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సుభాష్ వాఘ్మారే (61 ఓట్లు) తన సమీప ప్రత్యర్థి తాజా మాజీ ప్రధాన కార్యదర్శి బైర శేకర్ (51 ఓట్లు) పై 6 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం పొందారు. కోశాధికారిగా బి. రాజ్ కుమార్ (131 ఓట్లు) సాధించి సందీప్ (109 ఓట్లు) పై 22 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆర్గనైజేషన్ సెక్రెటరీ గా బొచ్చ రాజు (130 ఓట్లు) సాధించి తాజా మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండే మోహన్ (102 ఓట్లు) పై 28 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శులుగా సురేష్ (138 ఓట్లు), రవీందర్ నాయక్ (1.36 ఓట్లు), ఎస్. ఆంజనేయులు (123 ఓట్లు) సాధించి గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా 27 మంది పోటీలో ఉండగా అభ్యర్థులు సాధించిన ఓట్ల ప్రకారం మెజారిటీ ప్రకారం 12 మందిని విజేతలుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరిలో సితారి కృష్ణ (122 ఓట్లు), పబ్బ భూమేష్ (118 ఓట్లు), ఆడెపు నరేంద్ర స్వామి (110 ఓట్లు), భాస్కర్ గౌడ్ (109 ఓట్లు) దేశ్ ముఖ్ సందీప్ (107 ఓట్లు), కొట్టూరు సుదర్శన్ (104 ఓట్లు), రవి చరణ్ రెడ్డి (99 ఓట్లు), తాళ్ల శ్రీధర్ (97 ఓట్లు), ప్రీతం రెడ్డి (94 ఓట్లు), ఆడెపు శ్రీనివాస్ (91 ఓట్లు), జైపాల్ (87 ఓట్లు), సందీప్ గౌడ్, కొక్కు రవికుమార్ లకు ఇద్దరికీ సమానంగా 84 ఓట్లు పోలవడంతో ఇద్దరి మధ్య టై ఏర్పడింది.






