వృద్ధురాలుని బెదిరించి డబ్బులు లాక్కున్న ఇద్దరికి రిమాండ్

by Ratna Kumari |

దారి వెంట న‌డుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు వ‌ద్ద డ‌బ్బులు లాక్కొని పారిపోయిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.

వృద్ధురాలుని  బెదిరించి డబ్బులు లాక్కున్న ఇద్దరికి రిమాండ్
X

దిశ, మాచారెడ్డి : దారి వెంట న‌డుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు వ‌ద్ద డ‌బ్బులు లాక్కొని పారిపోయిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రామారెడ్డి మండలం రెడ్డి పెట్ గ్రామానికి చెందిన గడిల బైరయ్య, వడ్లూరుగ్రామానికి చెందిన కల్లూరు పరువయ్య కలిసి ఈనెల 22 న మాచారెడ్డి మండల చౌరస్తా లో అడిగే రాజవ్వ ( 62) తన ఇంటి నుంచి చౌరస్తాకు బ్యాగు కొనుగోలు వ‌చ్చింది. తిరిగి ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను చూసి ఆమె దగ్గరికి వెళ్లి బైకు ఆపి ఆమెను బలవంతంగా నీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వు, లేకుంటే చంపివేస్తున్నానని బెదిరించారు. ఆమె సంచిలో నుంచి రూ.5000 బలవంతంగా తీసుకొని అదే బైకుపై అక్కడినుండి పారిపోయారు. రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకొని మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. రూ.3000, బైకు ఒక సెల్ ఫోన్ రికవరీ చేసిన‌ట్టు తెలిపారు.

Next Story