- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారం రోజులు తిరుగక ముందే ఇద్దరు పురోహితుల మృతి
దిశ, భిక్కనూరు : వేద శాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పురోహితులు ఒకరి తర్వాత మరొకరు వరుసగా మృతి చెందడం కామారెడ్డి జిల్లా భి క్కనూరు మండల కేంద్రంలో ఆందోళన కలిగిస్తోంది.

దిశ, భిక్కనూరు : వేద శాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పురోహితులు ఒకరి తర్వాత మరొకరు వరుసగా మృతి చెందడం కామారెడ్డి జిల్లా భి క్కనూరు మండల కేంద్రంలో ఆందోళన కలిగిస్తోంది. మూడు నెలల క్రితం దివంగత తిగుళ్ల సాంబయ్య శర్మ సతీమణి జయలక్ష్మి (80)) మృతి చెందగా.. ఆ తర్వాత అదే వంశానికి చెందిన తిగుళ్ల ఉదయభాను(42) అనే యువ పురోహితుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఆ తర్వాత రెండు రోజులకే పెద్దడ్ల కాశీనాథ శర్మ (82) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడు వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన దశ దిన కర్మ కాండ కూడా జరుగక ముందే గురువారం అన్న పెద్దెడ్ల వెంకటేశ్వర శర్మ 88 పురోహితుడు( రిటైర్డ్ టీచర్ ) మృతి చెందడం పట్టణంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు అన్నదమ్ములతోపాటు, దివంగత తిగుళ్ల రామనాథ శర్మ మనవడు ఉదయభాను మృతి చెందడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలో పురోహితుల కుటుంబాలకు చెందిన నలుగురు వరుసగా మృతి చెందడం పట్టణ ప్రజల ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 3 నెలలలో రెండు స్థానిక ప్రధాన బ్రాహ్మణ వంశస్తులకు చెందిన ఇద్దరేసి చొప్పున మృతి చెందడం పట్టణ ప్రజలను కలచివేసింది.






