- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ కు మరో రెండు రాజధాని ఏసీ బస్సులు
by velandi.Saikiran |
ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. సోమవారం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆర్మూర్ ఆర్టీసీ నుండి

X
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులకు శుభవార్త. సోమవారం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆర్మూర్ ఆర్టీసీ నుండి మరో రెండు రాజధాని ఏసీ బస్సులను కొత్తగా ప్రారంభించినట్లు ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ సోమవారం తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ నుంచి సోమవారం ఉదయం 6.00 గంటలకు, 11.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ప్రారంభించినట్లు చెప్పారు.
అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజధాని ఏసి బస్సులను సాయంత్రం 06.15 నిముషాలకు, రాత్రి 9.30 నిముషాలకు ప్రారంభించిన విషయం తెలిసిందేనన్నారు. ప్రయాణికుల ఆదరణను బట్టి మరిన్ని బస్సులు శంషాబాద్ ఎయిర్ పోర్టు కు నడుపు తామన్నారు. కావున ఆర్మూర్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సేవలను సదవకాశాలను వినియోగించు కోగలరని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పి. రవికుమార్ తెలిపారు.
Next Story






