చిన్న పోతంగల్ గ్రామంలో రెండు ఇండ్లలో చోరీ

by Bhanu |   (  Updated:2025-05-07 16:30:06  IST  )

గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామంలో రెండు ఇండ్లల్లో చోరీ జరిగిందని స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు..

చిన్న పోతంగల్ గ్రామంలో రెండు ఇండ్లలో చోరీ
X

దిశ , గాంధారి : గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామంలో రెండు ఇండ్లల్లో చోరీ జరిగిందని స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి రోజా అదే గ్రామంలో వడ్ల రమేష్ ఇంట్లో కిరాయికి ఉంటుంది. నిన్న రాత్రి తను కిరాయికి ఉంటున్న ఇల్లుకు తాళం వేసి అదే గ్రామంలో గల తన తల్లిగారింట్లో పడుకోడానికి వెళ్ళగా , అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన ఇంటి పక్కన కిరాయి కి ఉంటున్న చాకలి శంకర్, కుమ్మరి రోజ కు ఫోన్ చేసి మీ ఇంటి తాళం కోసి తలుపులు తెరిచి ఉన్నాయని తెలుపగా వెంటనే ఆమె వచ్చి చూడగా ఇంట్లో గల బీరువాలో దాచుకున్న దాదాపు ఏడున్నర మాసాల బంగారము, 12 తులాల వెండి మరియు కొంత నగదు పోయినది అని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు..

అదే గ్రామంలో ఆ ఇంటికి దగ్గరలో గల కొర్రి గౌరవ్వ నిన్న రాత్రి ఆరు బయట నిద్రించగా , వర్షం పడడం తో ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకోవడం మర్చిపోయింది.. ఇదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో కి చొరబడి కొంత నగదు, 12 తులాల వెండి మరియు మహిళ మెడలో గల బంగారు గుండ్లను ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి దొంగతనం చేశారని బాధితురాలు పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.. సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ నేర స్థలాన్ని పరిశీలించారు..



Next Story