రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

దిశ, కమ్మర్ పల్లి : మండలం హాస కొత్తూరు ఉన్నత పాఠశాల చెందిన ప్రతిభ, ఆశ్రీత అనే ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీలకు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు ఎంపిక
X

దిశ, కమ్మర్ పల్లి : మండలం హాస కొత్తూరు ఉన్నత పాఠశాల చెందిన ప్రతిభ, ఆశ్రీత అనే ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో మంచి ప్రతిభ కనబర‌చ‌డంతో సెలెక్టర్ లు ఇద్దరు విద్యార్థినీలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారని తెలిపారు. సంగారెడ్డి లో ఈ నెల 07 నుంచి మూడు రోజుల పాటు జరిగే హాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినీలతో పాటు శిక్షణ ఇచ్చిన పాఠశాల పీ.డీ. మాధురిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

Next Story