జంట హత్యలు కలకలం...అక్రమ సంబంధమే కొంపముంచిందా?

by velandi.Saikiran |

ధర్మోరా గ్రామంలో ఆదివారం జరిగిన జంట హత్యలు స్థానికంగా కలకలం రేపింది . పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉ

జంట హత్యలు కలకలం...అక్రమ సంబంధమే కొంపముంచిందా?
X

దిశ, మాక్లూర్: ధర్మోరా గ్రామంలో ఆదివారం జరిగిన జంట హత్యలు స్థానికంగా కలకలం రేపింది . పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రసాద్.. ధర్మోరా గ్రామానికి చెందిన స్వప్నతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తరచూ స్వప్నను... కలిసేవాడు ప్రసాద్. అయితే ఈ నేపథ్యంలోనే స్వప్న ఇంటి పక్కనే ఉన్న గంగాధర్ కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడింది.

స్వప్న ఇంటికి తరచూ రావడం పట్ల గంగాధర్ ఫ్యామిలీ కక్ష పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అటు ప్రసాద్ కూడా... పగ తీర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే... తన స్నేహితుడు ఆకాష్ తో కలిసి, గంగారం కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు ప్రసాద్. అయితే ఇది గమనించిన గంగాధర్ కుటుంబ సభ్యులు... ప్రసాద్ అలాగే ఆకాష్ పై కారం చల్లి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో అక్కడికక్కడ ఆ ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీనివాస్... నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Next Story