కంకర మిషన్‌లో ఇరుక్కుని నుజ్జునుజ్జైన కార్మికుడి చేయి

by Yella Dhawani Reddy |

కంకర మిషన్‌లో ఇరుక్కుని నుజ్జునుజ్జైన కార్మికుడి చేయి
X

దిశ, కామారెడ్డి: మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని శ్రీనివాస కంకర క్వారీలో పని చేస్తున్న కార్మికుని చేయి విరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనుకుమార్ అనే కార్మికుడు రోజు మాదిరిగానే మంగళవారం కూడా కంకర మిషన్‌లో పనిచేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో మిషన్ బెల్టులో అనుకుమార్ ఎడమ చేయి ఇరుక్కుంది. మిషన్ రన్నింగులో ఉండటంతో అనుకుమార్ ఎడమ చేయి భుజం వరకు నుజ్జునుజ్జయింది. గమనించిన తోటి కార్మికులు వెంటనే మిషన్‌ను నిలిపేసి అనుకుమార్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. నుజ్జయిన చేతిని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Next Story