తాడ్వాయిలో విషాదం.. కొడుకు కొట్టాడ‌ని మ‌న‌స్తాపంతో తండ్రి ఆత్మ‌హ‌త్య‌

by Nallavelli.Anjaneyulu |

దిశ, తాడ్వాయి : సొంత కుమారుడు, అత‌ని రెండో భార్య పెడుతున్న వేధింపుల‌ను త‌ట్టుకోలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న కామారె

తాడ్వాయిలో విషాదం.. కొడుకు కొట్టాడ‌ని మ‌న‌స్తాపంతో తండ్రి ఆత్మ‌హ‌త్య‌
X

దిశ, తాడ్వాయి : సొంత కుమారుడు, అత‌ని రెండో భార్య పెడుతున్న వేధింపుల‌ను త‌ట్టుకోలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై న‌రేష్ తెలిపిన ప్ర‌కారం.. ​తాడ్వాయి గ్రామానికి చెందిన బాజనొల్ల స్వామి (52), రాజమణి దంపతులకు నవీన్ అనే కుమారుడు క‌ల‌డు. నవీన్ సుమారు 45 రోజుల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత నవీన్ తన తల్లిదండ్రులతో పాటు, మొదటి భార్య నవీతతో తరచూ గొడవ పడేవాడని, ఈ నెల 18న నవీన్ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, రెండో భార్యతో కలిసి ఉండాలని గొడవకు దిగినట్లు తెలిపారు. అందుకు నిరాకరించిన తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, తండ్రి స్వామి పై చేయి చేసుకున్నాడని తెలిపారు.

దీంతో ​సొంత కుమారుడే అందరి ముందు అవమానించి, కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి.. శుక్రవారం రాత్రి సమయంలో తన వ్యవసాయ పొలానికి వెళ్లి అక్కడ బీర్నిస్ కు కొట్టె పురుగుల మందు సేవించాడు.దింతో రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి 11:05 గంటలకు స్వామి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.​శనివారం మృతుడి భార్య రాజమణి తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తన కుమారుడు నవీన్,అతని రెండో భార్య రమ్యల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నాట్లు ఎస్సై నరేష్ తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.

Next Story