- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి : ఎస్పీ రాజేష్ చంద్ర
దిశ, కామారెడ్డి : సురక్షిత ప్రయాణానికి వాహన దారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.

దిశ, కామారెడ్డి : సురక్షిత ప్రయాణానికి వాహన దారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ భద్రతను మరింత మెరుగుపరచడానికి నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను సమగ్రంగా పరిశీలించారు. కొత్త బస్టాండ్ నుండి లింగంపేట్, ఎల్లారెడ్డి వైపు వాహన రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ సిగ్నల్స్ ను తనిఖీ చేసి, ఇకపై వాహనదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్ కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అని, సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. ప్రతి ప్రయాణంలో ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా సురక్షితం అవుతుందని, రాంగ్ రూట్ లేదా అశ్రద్ధగా డ్రైవ్ చేయడం ప్రమాదాలను పెంచుతుందని తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగంతో డ్రైవ్ చేయకూడదని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్-సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం/రాష్ డ్రైవింగ్ – లాంటివి చేస్తే వాహనదారులకు ట్రాఫిక్ చలాన్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణ పౌరులు, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై మహేష్, టౌన్ ఎస్సై నరేష్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.






