10 గంటలుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

by velandi.Saikiran |

కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. దింతో భిక్కనూరు మండలం జంగంపల్లి

10 గంటలుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. దింతో భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని 44వ నెంబర్ జాతీయ రహదారి పై నుంచి భారీ ఎత్తున నీరు పారుతుండడంతో ట్రాఫిక్ ఎక్కడికి అక్కడే నిలిచిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు కూడా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ట్రాఫిక్ లో ఇరుక్కు పోయిన ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లలో ప్రయాణిస్తున్న వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగడానికి నీరు, తినడానికి భోజనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులైతే వారి బాధలు వర్ణానాతీతంగా ఉన్నాయి. ఆహారం, మంచినీరు అందించి ఆదుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story