ఆర్మూర్ లో వివాహానికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

by Bhanu |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ లో గల శ్రీ వెంకటేశ్వర ఏసీ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన కేసరి అశోక్ గౌడ్ కుమార్తె దీక్షిత వివాహ శుభకార్యానికి తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు హాజరై నూతన దంపతులను కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్మూర్ లో వివాహానికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ లో గల శ్రీ వెంకటేశ్వర ఏసీ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన కేసరి అశోక్ గౌడ్ కుమార్తె దీక్షిత వివాహ శుభకార్యానికి తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు హాజరై నూతన దంపతులను కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు ఆర్మూర్ కు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఇందూర్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెర్కిట్ కొటార్మూర్ గ్రామానికి చెందిన గౌడ సంఘం ప్రతినిధులు వారి గౌడ ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆర్మూర్ ప్రాంతానికి రావడంతో పట్టు శాలువాలతో పూల మాలలతో ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.



తర్వాత పెర్కిట్ గ్రామానికి చెందిన మరకజ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీం, కార్యదర్శి మున్షి, కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ అబ్దుల్ నయీమ్ ప్రత్యేకంగా కలిసి పట్టు శాలువాలతో మహేష్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. గౌడ సంఘం ప్రతినిధులు, మర్కజ్ కమిటీ సభ్యులు వారి సమస్యలను వివరించి పరిష్కరించాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్, మాజీ నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ యాల సాయి రెడ్డి,ఆర్మూర్ అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్, మున్సిపల్ మాజీ చైర్మన్లు వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ వినీత పవన్, పీసీసీ మాజీ కార్యదర్శి కాందేశ్ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ షేక్ మున్న, శాయంపేట మాజీ సర్పంచ్ రంగు అనిల్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు షెట్పల్లి నారాయణ, శ్యామ్ గౌడ్ తదితరులు, గౌడ సంఘం ప్రతినిధులు మందాపురం దశ గౌడ్ , మెరుగు మహేందర్ గౌడ్, గుర్రం వెంకట్ గౌడ్ , షేర్ల గంగాధర్ గౌడ్, కుంట సాగర్ గౌడ్ , వేల్పూర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story