- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీంపూర్ లో పులి కలకలం..
దిశ, ఆర్మూర్ : మొంథా తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని శనివారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ కు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ

దిశ, ఆర్మూర్ : మొంథా తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని శనివారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ కు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ..అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస ను పాలకులు పట్టుకొచ్చుకోవడం లేదని విమర్శించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వేలాది ఎకరాలు పంట నష్టం వాటిలిందని ఆర్మూర్ డివిజన్ లో సుమారు 50 వేల ఎకరాలకు పైగా పంటలు నీటిపాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో నాశనమైందని అన్న దాతలు ఆందోళన చెందుతున్నారని రైతులు విత్తనాలు నాటి నుంచి మొదలుకొని ఎరువుల కోసం సాగునీటి కోసం చివరికి పండించిన పంట అమ్ము కునేందుకు నానా కష్టాలు పడుతున్నాడని ప్రతి సీజన్లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాల రీత్ పంటలు నష్టపోతే పంటల బీమా పథకం కింద రైతులకు ఆదుకోవాల్సి ఉంటుందని కానీ ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపిచారు దాని ఫలితంగా ప్రకృతి వల్ల పంటల దెబ్బతింటే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన వివరాలను సేకరించి రైతులకు ఎకరానికి 30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఆపదలో రైతులను ఆదుకోవాలని అన్నారు. ఐకేపీ కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆ విధంగా ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియకు రైతు సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టీ భూమన్న, ఇడగొట్టి సాయిలు, కుల్దిప్ శర్మ, జన్నపల్లి నాడిపి రాజన్న, భామండ్ల రవి పాల్గొన్నారు.






