పెళ్లి ప‌త్రిక‌లు ఇవ్వడానికి వ‌చ్చిన‌ట్టు న‌మ్మించి మూడున్న‌ర తులాల బంగారం చోరీ

by Ratna Kumari |   (  Updated:2026-03-17 11:39:55  IST  )

పెళ్లి ప‌త్రిక‌లు ఇచ్చేందుకు వ‌చ్చిన‌ట్టు న‌మ్మించింది. ఇంట్లో ఎవ్వ‌రు లేని విష‌యాన్ని గ్ర‌హించింది. ఒక ఇంటి వ‌ద్ద‌ మ‌హిళ‌ను త‌ల‌పై బాది ఆమె మెడ‌లో ఉన్న‌టువంటి మూడున్న‌ర తులాల బంగారాన్ని చోరీ చేసింది గుర్తు తెలియ‌ని మ‌హిళ‌.

పెళ్లి ప‌త్రిక‌లు ఇవ్వడానికి వ‌చ్చిన‌ట్టు న‌మ్మించి మూడున్న‌ర తులాల బంగారం చోరీ
X

దిశ‌, ఆర్మూర్ : పెళ్లి ప‌త్రిక‌లు ఇచ్చేందుకు వ‌చ్చిన‌ట్టు న‌మ్మించింది. ఇంట్లో ఎవ్వ‌రు లేని విష‌యాన్ని గ్ర‌హించింది. ఒక ఇంటి వ‌ద్ద‌ మ‌హిళ‌ను త‌ల‌పై బాది ఆమె మెడ‌లో ఉన్న‌టువంటి మూడున్న‌ర తులాల బంగారాన్ని చోరీ చేసింది గుర్తు తెలియ‌ని మ‌హిళ‌. ఈ సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప‌ట్ట‌ణ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలు దీపిక తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆర్మూర్ ప‌ట్ట‌ణ కేంద్ర ప‌రిధిలోని పెర్కిట్ ప్రాంతంలోకి ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళా ప‌ట్టుచీర క‌ట్టుకొని ప్ర‌వేశించింది. గృహిణి దీపిక ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఇంట్లో ఎవ్వ‌రూ లేని విష‌యాన్ని గ్ర‌హించి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వ‌చ్చాన‌ని న‌మ్మ‌బ‌లికింది. ఇదే స‌మ‌యంలో దీపిక త‌ల‌పై బ‌లంగా కొట్టి ఆమె మెడ‌లో ఉన్న‌టువంటి మూడున్న‌ర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లింది.

బంగారం చోరీ ఘ‌ట‌న‌తో ఆర్మూర్ ప్రాంత ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. బాధితురాలు దీపిక స్పృహ కోల్పోవ‌డంతో వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి తర‌లించారు. ఆ త‌రువాత పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలలో బంగారం చోరీకి పాల్ప‌డిన దుండ‌గుల‌ను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రోజు రోజుకు బంగారానికి ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో దుండ‌గులు కొత్త ఆలోచ‌న‌ల‌తో బంగారం చోరీ చేస్తున్నారు. ఎవ‌రైనా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇంట్లోకి ప్ర‌వేశిస్తే.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అనుమానం వ‌స్తే డ‌య‌ల్ 100 కి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు పోలీసులు.

Next Story