- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగలను త్వరలోనే పట్టుకుంటాం : సీఐ తిరుపయ్య
పిట్లం మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు హల్ చల్ సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు హల్ చల్ సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం జరిగిన ప్రదేశాలను బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య స్వయంగా పరిశీలించారు. క్లూస్ టీం ను రప్పించి వేలిముద్రల నమూనాలను సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ తిరుపయ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వేరే ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వలేదని సమాచారం ఇస్తే ఆ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంచేవారిమని అలాకాకుండా సమాచారం ఇవ్వకపోవడం సరి కాదు అని అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరిచయం లేని వ్యక్తులు తారాసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్ళినప్పుడు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి వెళ్లరాదని ఆయన ప్రజలకు సూచించారు. ఏది ఏమైనా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అపహరణకు గురైన వస్తువులను రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఎస్సై వెంకట్రావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






