వింత దొంగలు... ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి

by velandi.Saikiran |   (  Updated:2025-08-26 16:16:13  IST  )

ధర్పల్లి మండల కేంద్రంలో మూడు ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దింతో రైతుల

వింత దొంగలు... ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి
X

దిశ, ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంలో మూడు ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దింతో రైతులు లబోదిబోమన్నారు. సీతాయిపేటకు చెందిన బాశం సందీప్ , తనుగుల విజయ్, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మల్గరి శ్రీనివాస్ లకు చెందిన ట్రాన్స్ ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి, వాటిలోని ఆయిల్ , కాపర్ తీగలను ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్ కో ఏఈ నాగేశ్వర్ రావు కు బాధిత రైతులు సమాచారం అందించారు. అనంతరం ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఏఈ. ట్రాన్స్ ఫార్మర్ల విలువ రూ. 4.20 లక్షల వరకు ఉంటుందని ఏఈ నాగేశ్వర్ రావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు ధర్పల్లి ఎస్ఐ కళ్యాణి. కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Next Story