- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నా సాగర్ గ్రామంలో 9 ఇళ్లలో చోరీ
అన్నసాగర్ గ్రామంలో అర్థరాత్రి దొంగలు 9 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు.

దిశ, ఎల్లారెడ్డి : అన్నసాగర్ గ్రామంలో అర్థరాత్రి దొంగలు 9 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి తొమ్మిది ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఫంక్షన్లకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్న సాగర్ కి చెందిన గంగాగౌడ్ ఇంట్లో 30 తులాల బంగారం, 28 తులాల వెండి, రూ.25 వేలు నగదును దొంగలు అపహరించుకుపోయినట్టు బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. అలాగే శ్రీను, సాయిలు ఇళ్లల్లో కూడా రూ.10వేల నగదు, కర్రె పోచయ్య ఇంట్లో 20 తులాల వెండి, అర తులం బంగారం చోరీకి గురయ్యాయి.
కొనుగోళ్ల రాములు, జంగిడి సురేందర్ ఇళ్లలో దుస్తులు, ఇతర వస్తువులు, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో రూ.50 వేల నగదు, చీరలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. రామచందర్ రెడ్డి, మంద నాగిరెడ్డి ఇళ్లలో పోయిన వస్తువుల వివరాలు ఇంకా తెలియరాలేదు. మిగితా ఇళ్లలో రూ.ఐదు నుంచి రూ.పదివేల లోపు నగదు, పట్టుబట్టలను దుండగులు అపహరించుకు వెళ్లినట్లు తెలిపారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్సై, సీఐతో పాటు జిల్లా సీసీఎస్ పోలీసులు, క్లూస్ టీం అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇదే తరహాలో వర్ని, రుద్రూర్ గ్రామాల్లో సైతం దొంగతనాలు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్థానిక ముఠా లేదా బీహార్ ముఠా పనేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఫింగర్ ప్రింట్లను మ్యాచింగ్ కోసం పంపించారు.






