భార్య కాపురానికి రావ‌డం లేద‌ని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

భార్య కాపురానికి రావ‌డం లేద‌ని మ‌నోవేద‌నతో బిర్కూర్ మండ‌లం, అన్నారం గ్రామానికి చెందిన న‌రేష్ గౌడ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

భార్య కాపురానికి రావ‌డం లేద‌ని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, బాన్సువాడ : భార్య కాపురానికి రావ‌డం లేద‌ని మ‌నోవేద‌నతో బిర్కూర్ మండ‌లం, అన్నారం గ్రామానికి చెందిన న‌రేష్ గౌడ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైద‌రాబాద్ లో ఓ హాస్ట‌ల్ లో అన్న మ‌హేష్ తో క‌లిసి ఉంటున్న న‌రేష్ ఉరేసుకున్నాడు. చ‌నిపోయే ముందు త‌న బాధ‌ను వీడియో తీసి అన్న‌కు వాట్సాప్ చేశాడు. ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించిన భార్య నిరాక‌రించ‌డంతో స‌మాజంలో ప‌రువు పోయింద‌ని అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story