- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
రైతులు పండించిన వరితో పాటు పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

దిశ, జుక్కల్/ (నిజాంసాగర్) : రైతులు పండించిన వరితో పాటు పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లి మండలం కుర్లా గ్రామంలో ఐకేపీ మహిళ సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం, పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని, బిచ్కుంద మండలంలోని ఖత్గావ్, షెట్లూరు గ్రామాలలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, రైతులతో కలిసి ప్రారంభించారు. అనంతరం డోంగ్లీ మండల కేంద్రంతో సహా మోఘ, ఏలేగావ్, కుర్లా గ్రామాల్లో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అందరూ తమ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. దళారులకు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే అందరూ బాగుంటామన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదన్నారు.
రైతులు తమ పంటను శుభ్రపరచి, బాగా ఆరబెట్టుకుని ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధరను పొందాలని ఏ గ్రేడ్ రకం వరి ధాన్యానికి క్వింటాలకు రూ.2389లు బీ గ్రేడ్ రకానికి రూ.2369లు మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. పొద్దు తిరుగుడు క్వింటాలకు రూ.7721లు మద్దతు ధర పొందాలని అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాలో పడుతున్నాయని, రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు. నాడు ప్రతిపక్షంలో కల్లాలకు కాంగ్రెస్ పార్టీ రైతుల కష్టాలను స్వయంగా చూసి, రైతులెవరు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుండి తాళ్లు, తరుగు పేరిట 5 నుండి 6 కిలోల ధాన్యాన్ని దోచుకునేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం రైతుల బాధలు తెలిసిన ప్రభుత్వమని గతంలో మాదిరిగా తాళ్ల పేరుతో దాన్యంలో కోతలు పెట్టొద్దని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, గన్ని బ్యాగులు అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోజ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యూనుస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజానన్ దేశాయి, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఐకెపి మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి సంగం ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు.






