బైక్, ఎక్సెల్ ను ఢీ కొట్టిన‌ వాహనం.. వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, భిక్కనూరు : రాష్ డ్రైవింగ్ తో... ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో పాటు.. ఆ తర్వాత బ్రిజ్జా వాహనం టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొన్న సంఘటనలో ఒకరు

బైక్, ఎక్సెల్ ను ఢీ కొట్టిన‌ వాహనం.. వ్య‌క్తి మృతి
X

దిశ, భిక్కనూరు : రాష్ డ్రైవింగ్ తో... ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో పాటు.. ఆ తర్వాత బ్రిజ్జా వాహనం టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం భిక్కనూరు మండలం జంగంపల్లి ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలోని 44వ హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బ్రిజ్జా వాహనం ఓవ‌ర్ స్పీడ్ గా వచ్చి అదే దారిలో ముందుగా వెళుతున్న బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న లక్ష్మీ నగర్ తండా కు చెందిన మనోహర్, నిశాంత్ అనే ఇద్దరు యువకులు బైక్ పై నుంచి ఎగిరి కింద పడిపోయి గాయపడ్డారు. అయినప్పటికీ వాహనం అదే స్పీడుతో రహదారి పక్కన సీతాఫలాలు విక్రయించుకుంటూ టీవీఎస్ ఎక్సెల్ పై కూర్చున్న, అదే తండాకు చెందిన బానోతు శంకర్(55)ను ఢీ కొట్ట‌డంతో అత‌ను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన వారిద్దరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు భిక్కనూరు ఎస్ఐ నరేందర్ తెలిపారు.

Next Story