మ‌హిళా మృతికి కార‌ణ‌మైన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ ను అరెస్ట్ చేయాలి

by Ratna Kumari |

ఇసుక ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ అతివేగంగా న‌డ‌ప‌డంతో ఆటోను ఢీ కొట్టడంతో మ‌హిళా మృతి చెందిన విష‌యం తెలిపిందే.

మ‌హిళా మృతికి కార‌ణ‌మైన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్  ను అరెస్ట్ చేయాలి
X

దిశ‌, బాన్సువాడ : ఇసుక ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ అతివేగంగా న‌డ‌ప‌డంతో ఆటోను ఢీ కొట్టడంతో మ‌హిళా మృతి చెందిన విష‌యం తెలిపిందే. అయితే ఆ మ‌హిళా మృతికి కార‌ణ‌మైన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ ను అరెస్ట్ చేయాల‌ని బాన్సువాడ ప‌ట్ట‌ణంలోని పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద బుడ్మి గ్రామ‌స్తులు మృత‌దేహంతో మృతురాలు బంధువులు ఇవాళ రాస్తారోకో నిర్వ‌హించారు. కొల్లూరు శివారులో ఈ ట్రాక్ట‌ర్ ఢీ కొన‌డంతో కూలీ ప‌ని చేసే రుక్మిణీ అనే మ‌హిళా మృతి చెందింది. పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అదుపులో తీసుకోలేదని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల‌ని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ రోడ్డు పై చాలసేపు మృత దేహంతో బైఠాయించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని, సముదాయించే ప్రయత్నం చేసిన గ్రామస్థులు మాత్రం రాస్తారోకో నిర్వ‌హించారు. డీఎస్పీ విఠ‌ల్ రెడ్డి త్వ‌ర‌లో నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో ధ‌ర్నా విరమించారు.

Next Story