- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మద్నూర్ : తిట్టడని కక్షతో ముగ్గురు కలిసి కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన మండలంలోని ఎక్లార గ్రామంలో చోటు చేసుకుంది. మద్నూర్ ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్లార గ్రామానికి చెందిన దానేవార్ సిద్రామ్ మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన మీసాలె హన్మంతు, గుంగుబలి రాజు, కల్నూర్ సాయిలులకు తిట్టడని.. వారంతా మనసులో పెట్టుకున్నారు. శనివారం సాయంత్రం సిద్రామ్ పై ముగ్గురు వ్యక్తులు కర్రతో కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అతని భార్య దానేవార్ లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.
Next Story






