- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థిని మృతి పై ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తాం
బాన్సువాడ మండలం, బోర్లం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో 8వ తరగతి విద్యార్థిని సంగీత నిన్న ఆటో నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పట్ల సంతాపాన్ని తెలియజేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలం, బోర్లం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో 8వ తరగతి విద్యార్థిని సంగీత నిన్న ఆటో నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పట్ల సంతాపాన్ని తెలియజేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి. విద్యార్థిని సంగీత మృతికి సంతాపంగా ఇవాళ బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతి చెందిన విద్యార్థిని మద్నూర్ మండలం, కోడిచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని పోచారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందించారు. త్వరలోనే ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని వారి కుటుంబానికి చెల్లిస్తామని ఈ సందర్భంగా పోచారం తెలిపారు.
సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థిని దురదృష్టవశాత్తు మృతి చెందింది. ఈ విద్యార్థిని మృతికి గల కారణాలపై పోలీస్ విచారణ చేసి బాధ్యులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయమని ఆదేశించి నట్టు తెలిపారు. అలాగే సంబంధిత ప్రిన్సిపాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేసి ఆమె పై శాఖా పరమైన చర్యలు చేపట్టడానికి ఉన్నతాధికారులు నిర్ణయించారని తెలిపారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం తరఫున తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్థిక సహాయం అందేటట్లు చేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. విచారణ అనంతరం ఇంకా ఎవరైనా బాధ్యులుగా తేలినట్లయితే వారందరిపై చర్యలు చేపట్టనున్నట్టు సబ్ కలెక్టర్ తెలిపారు.






