- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బదిలీపై వెళుతున్న అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ను అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా సక్సెస్ ఫుల్ గా విధులు నిర్వహించి బదిలీ పై వెళ్తున్న గట్టు బస్వారెడ్డిని పోలీస్ కమిషనర్ మంగళవారం ఘనంగా సన్మానించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా సక్సెస్ ఫుల్ గా విధులు నిర్వహించి బదిలీ పై వెళ్తున్న గట్టు బస్వారెడ్డిని పోలీస్ కమిషనర్ మంగళవారం ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు బస్వారెడ్డి మెరుగైన సేవలను ప్రశంసించారు. పోలీస్ విభాగంలో ఆయన చేసిన కృషి, కట్టు దిట్టమైన పరిపాలన, ప్రజల భద్రత కోసం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా సీపీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు పాల్గొని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.






