- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్
దిశ, కామారెడ్డి : వృద్ధురాలుని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన

దిశ, కామారెడ్డి : వృద్ధురాలుని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. జిల్లా పరిధిలోని నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండాకు చెందిన గుగులోత్ రాధిబాయి అనే వృద్ధురాలు దీపావళి రోజు హత్యకు గురైందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. వృద్ధురాలి ఇంటి ఎదురుగా ఉంటున్న మెగావత్ సవాయి సింగ్ అనే వ్యక్తి హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మద్యం తాగడం, పేకాట ఆడటం, ఇతర జల్సాలకు అలవాటు పడిన సవాయి సింగ్ దీపావళి రోజు వరుసకు నానమ్మ అయిన రాధిబాయి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళాడన్నారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో వృద్ధురాలి చేతులకు ఉన్న రెండు కడియాలు దొంగిలించి వృద్ధురాలు తలను నేలకేసి కొట్టి గొంతు పిసికీ హత్య చేశాడని తెలిపారు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో బయట ఉన్న మరొక మహిళకు గాయం చేసినట్లు తెలిపారు. బుధవారం కడియాలు అమ్మడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇతను 2021 లో మరొక వ్యక్తితో కలిసి బాన్సువాడ టీచర్స్ కాలనీలో ఉన్న బంధన్ ప్రైవేట్ బ్యాంకులో కంప్యూటర్ దొంగిలించిన కేసులో కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. అలాగే చిన్న చిన్న దొంగతనాలు చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడని, ఇతనిపై నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉందని తెలిపారు. నిందితుని నుంచి వెండి కడియాలు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలిస్తున్నట్టు వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.






