వృద్ధురాలు అదృశ్యం

by Ratna Kumari |

వృద్దురాలు అదృశ్య‌మైన సంఘ‌ట‌న వ‌ర్ని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

వృద్ధురాలు అదృశ్యం
X

దిశ‌, బాన్సువాడ : వృద్దురాలు అదృశ్య‌మైన సంఘ‌ట‌న వ‌ర్ని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిజామాబాద్ జిల్లా గోవూర్ కి చెందిన ల‌చ్చ‌వ్వ‌(65) ఈనెల 13న మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంటికి తిరిగి రాలేద‌ని.. ఆమె ఆచూకి కోసం వెతికినా, బంధువుల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను సంప్ర‌దించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండాపోయింది. దీంతో కోడ‌లు సౌజ‌న్య వ‌ర్ని పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో నుంచి వెళ్లిన స‌మ‌యంలో మెరూన్ క‌ల‌ర్ చీర ధ‌రించి ఉంద‌ని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story