స్పీడ్ బ్రేక‌ర్ల వ‌ద్ద కారును ఢీ కొన్న లారీ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, భిక్క‌నూరు : ముందు వెళ్తున్న కారును.. వెనకాల నుంచి స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటనను మరచిపోక

స్పీడ్ బ్రేక‌ర్ల వ‌ద్ద కారును ఢీ కొన్న లారీ
X

దిశ‌, భిక్క‌నూరు : ముందు వెళ్తున్న కారును.. వెనకాల నుంచి స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటనను మరచిపోక ముందే తాజాగా ముందు వెళ్తున్న కారును దాని వెనకాలే వస్తున్న లారీ ఢీకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ప్లాజా వద్ద టోల్ చెల్లించి అదిలాబాద్ వెళుతున్న కారు ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయనే ఉద్దేశంతో నెమ్మదిగా వెళ్తుండ‌గా.. దాని వెనకాలే వస్తున్న నాందేడ్ వెళ్తున్న లారీ వెనకాల నుంచి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు ఎలాంటి గాయాలు తగలకుండా సేఫ్ గా బయటపడ్డారు. రెండు రోజుల క్రితం ఇదే స్థలంలో కారును స్కూల్ బస్సు ను ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న యజమాని గాయపడిన విషయం తెలిసిందే.

Next Story