- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్
ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో పాటు మేమున్నామనే భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఏ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.

దిశ, కామారెడ్డి : ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో పాటు మేమున్నామనే భరోసా కల్పించడానికే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఏ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్.ఏ.ఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించినట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు, మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
మన రాష్ట్రంలో హాకింపేట్ సికింద్రాబాదులో 99 బెటాలియన్ ఉందన్నారు. అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్, డైలీ మార్కెట్, సుభాష్ రోడ్, పాంచ్ చౌరస్తా, బడా మసీద్, నిజాం సార్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే గేట్, బతుకమ్మ కుంట, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి యాకూబ్ రెడ్డి, కామారెడ్డి టౌన్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్ కుమార్, కృష్ణ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, ఆర్ఎఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది 145 మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.






