నేలపై కూర్చొని భోజనం చేసిన కలెక్టర్

by velandi.Saikiran |   (  Updated:2025-08-26 16:04:06  IST  )

విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం నేలపై కూర్చొని చేశారు. ఆయన వెంట గడి కోట మేనేజర్ బాబ్జి , గణేష్ విన

నేలపై కూర్చొని భోజనం చేసిన కలెక్టర్
X

దిశ, దోమకొండ: చదువుతోపాటు, క్రీడల్లో కూడా రాణించాలని, అప్పుడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దోమకొండ ఫోర్ట్, విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్, జిల్లా యువజన క్రీడాభివృద్ధి సమన్వయంతో నిర్వహించిన క్రీడలకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఓటమిపాలు అయినంత మాత్రాన నిరుత్సాహపడవద్దని, నేటి ఓటమి రేపటి గెలుపునకు బాటలు వేస్తుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని బాలుర పాఠశాలను విజిట్ చేశారు. విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం నేలపై కూర్చొని చేశారు. ఆయన వెంట గడి కోట మేనేజర్ బాబ్జి , గణేష్ వినయ్, భువన్ వర్మ , రామకృష్ణ హరీష్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ సుధాకర్, మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఏఓ మౌనిక ఉన్నారు.

Next Story