సంఘ సమావేశంలో ఇరువురి మధ్య ఘర్షణ.. ఇంతకీ ఏమైనట్టు!

by Naveena |

నిజామాబాద్ నగరలోని గాజుల్ పేట్ లో మంగళవారం ఓ కుల సంఘం సమావేశంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసింది.

సంఘ సమావేశంలో ఇరువురి మధ్య ఘర్షణ.. ఇంతకీ ఏమైనట్టు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరలోని గాజుల్ పేట్ లో మంగళవారం ఓ కుల సంఘం సమావేశంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసింది. స్థానిక నాయీబ్రాహ్మణ సంఘం సమావేశంలో ఓ విషయంపై కుల సంఘంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వారిని సమావేశంలో పాల్గొన్న ఇతర సభ్యులు సముదాయించే ప్రయత్నం చేసినా ఘర్షణ పెద్దదిగా మారి సంతోష్ అనే వ్యక్తి ఆవేశంతో ముందుకు ఉరికి గంగాధర్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు.

ఈ దాడితో గంగాధర్ కడుపులో గాయం కాగా రక్తస్రావమైంది. దీంతో అక్కడున్న మిగతా సభ్యులు తేరుకుని దాడి చేసిన వ్యక్తిని అడ్డుకుని గంగాధర్ ను పక్కకు తప్పించారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని దాడిలో గాయాల పాలైన గంగాధర్ ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story