- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్
దిశ, మాచారెడ్డి : ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టిన ప్రమాదం లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు

X
దిశ, మాచారెడ్డి : ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టిన ప్రమాదం లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్లితే.. మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామ శివారులో ని సిద్దిపేట రహదారి పై మూత్ర విసర్జన కై లారిని రోడ్డు పక్కన డ్రైవర్ నిలిపాడు. మాచారెడ్డి క్రాస్ రోడ్డు( గజ్యానాయక్ తండా) నుంచి లచ్చాపేట కు బైక్ పై వస్తున్న అదే గ్రామానికి చెందిన మిరిదొడ్డి అజయ్, జక్కుల సాయి అనే యువకులు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. లారి టైర్ కు ఆ ఇద్దరిలో ఎవరిదో విరిగిన బొక్క గుచ్చుకోవడాన్ని బట్టి చూస్తే.. వారు అతివేగంగా బైక్ నడుపుతున్నట్టుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారి, బైక్ ను మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story






