మాచారెడ్డిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సర్పంచ్ సంతోష్ రెడ్డి

by Ratna Kumari |

మాచారెడ్డి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మండల కేంద్రమైన మాచారెడ్డి సర్పంచ్ సంతోష్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారంలో దూకుడు ప్రదర్శిస్తున్న సంతోష్ రెడ్డిని గ్రామస్తులు అభినందనలతో ముంచేత్తుతున్నారు.

మాచారెడ్డిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సర్పంచ్ సంతోష్ రెడ్డి
X

దిశ, మాచారెడ్డి : మాచారెడ్డి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మండల కేంద్రమైన మాచారెడ్డి సర్పంచ్ సంతోష్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారంలో దూకుడు ప్రదర్శిస్తున్న సంతోష్ రెడ్డిని గ్రామస్తులు అభినందనలతో ముంచేత్తుతున్నారు. లో వోల్టేజి సమస్యను తీరుస్తూ గృహాలలో వీధులలో విద్యుత్ వెలుగులు నిండాయి. మండల కేంద్రమైన మాచారెడ్డి లో ఇన్ని రోజులపాటు లో వోల్టేజి సమస్యతో బాధపడుతున్న గ్రామస్తులకు ఇటీవల ఎన్నికైన సంతోష్ రెడ్డి విద్యుత్ అధికారులతో మాట్లాడి ఒక్కొక్క వార్డులో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించడం పట్ల గ్రామస్తులు హర్షం వెలిబుచ్చుతున్నారు. గెలిచిన వారం రోజుల నుంచి విద్యుత్తు, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను నిర్వహిస్తూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నారు. గ్రామపంచాయతీలో బ్యాలెన్స్ లేకున్నా తన సొంత నిధులతో సమస్యలు తీరుస్తున్నారు. నిరాదరణ గురైన మాచారెడ్డిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఈ గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి అన్నారు.

Next Story