మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్టు, రిమాండ్

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : ఓ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో

మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్టు, రిమాండ్
X

దిశ, కామారెడ్డి : ఓ మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పాల్వంచ మండలంలోని ఫరీద్ పేట్ గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ నెల 26న వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వెనక నుంచి ఒక వ్యక్తి కనబడకుండా వచ్చి బలంగా కొట్టి గాయపరిచి కిందపడగా మరలా భయపెట్టి పొదల్లోకి లాక్కెళ్లి అరుపులు, కేకలు వేయకుండా నోరు మూసి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. అతన్ని గుర్తుపట్టగలనని మాచారెడ్డి పి‌ఎస్ లో బాధితురాలు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ జరిపినట్లు చెప్పారు. శ్రీ మణికంఠ రైస్ మిల్ లో పనిచేసే బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గా గుర్తించగా అతను పరారీలో ఉన్నట్లు తేలిందన్నారు.

వెంటనే నిందితుడిని పట్టుకోవడానికి కామారెడ్డి రూరల్ సీఐ, ఎల్లారెడ్డి సీఐ, సీసీఎస్ సీఐ, మాచారెడ్డి ఎస్ఐ, దేవునిపల్లి ఎస్ఐ, గాంధారి ఎస్సై, బీబీపేట్ ఎస్సై 7 ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. నిండితుడు బీహార్ వెళ్లిపోవచ్చని భావిస్తూ ముందస్తుగా బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు ముందుగా పంపి నిందితుడు ఎన్ని ఉపాయాలు పన్నినా పై ఎత్తుగా ఆలోచిస్తూ సాంకేతిక, ముందస్తు సమాచార సేకరణ ఆధారంగా 30న మహారాష్ట్ర రాష్ట్రం లోని గోండియా జిల్లాలో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు. చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్ట్ లో హాజరుపర్చినట్లు వివరించారు. నిందితుడు రాహుల్ కుమార్ (26) వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితున్ని చాచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Next Story