- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతిపై మాట్లాడే అర్హత ఆ ఎమ్మెల్యేకు లేదు : షబ్బీర్ అలీ
అవినీతిపై మాట్లాడే అర్హత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

దిశ, కామారెడ్డి : అవినీతిపై మాట్లాడే అర్హత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 18, 41, 42, 43, 48, 49 వార్డుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే పారిపోవడమేనా..? అని ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండున్నర ఏళ్లలో కామారెడ్డికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా..? అని ఎమ్మెల్యే రమణారెడ్డిని ప్రశ్నించారు. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం లేక తప్పించుకు తిరుగుతున్నారన్నారు. రోడ్లు వేయడం, డ్రైనేజీలు కట్టడం, నీటి సరఫరా చేయడం, పట్టణ పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు వేయడం అభివృద్ధి కాదట..! మరి ఇంకేది అభివృద్ధి అంటే అని నిలదీశారు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనపడకుండా పారిపోవడమే మీ దృష్టిలో అభివృద్ధి నా, మేము ఈ గడ్డపై చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాం, ఆ ధైర్యంతోనే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామన్నారు.
అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదు..
అవినీతి పై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని, మీ గత చరిత్ర అంతా అవినీతిమయం అని, దాన్ని నిరూపించే బాధ్యత మాదేనని ఎమ్మెల్యే ను ఉద్దేశించి అన్నారు. సాధ్యమైన పనులకే హామీ ఇచ్చి అమలు చేసి చూపిస్తామని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే, వెంటనే నా దృష్టికి తీసుకురావాలని, వారిని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద నిలబెట్టి, పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






