- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.9.60 లక్షలకు తై బజార్ వేలం
గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం 2026-27 సంవత్సరానికి సంబంధించి తై బజారు వేలాన్ని సర్పంచ్ మమ్మాయి రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు.

దిశ, గాంధారి : గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం 2026-27 సంవత్సరానికి సంబంధించి తై బజారు వేలాన్ని సర్పంచ్ మమ్మాయి రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాటను గాంధారి కి చెందిన గడ మురళి రూ.9.60 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. మొత్తం నలుగురు పాల్గొనగా.. చివరికీ మురళి అత్యధికంగా వేలం పాట పాడి దక్కించుకున్నట్టు సర్పంచ్ తెలిపారు. దాఖలు చిట్టి వేలం పాడగా.. వాడే శ్రీధర్ రూ.4.32 లక్షలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కామారెడ్డి భాస్కర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు జర్పుల సంజీవ్, బెల్లాయి అశోక్, గంగి రవి, బస శివాజీ, పత్తి సాయిలు, సిందె నితిన్ కుమార్, రమేష్, మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, గ్రామస్తులు చద్మల్ సాయికుమార్, పెద్దబూరి రాములు, జింగురు సురేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.






