ఆర్మూర్ మున్సిపాలిటీలో మొద‌లైన ప్ర‌లోభాలు

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రలోభాలు ప్రారంభ మయ్యాయి.

ఆర్మూర్ మున్సిపాలిటీలో మొద‌లైన ప్ర‌లోభాలు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రలోభాలు ప్రారంభ మయ్యాయి. ఆర్మూర్ మున్సిపల్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. కుల సంఘాల, యువజన సంఘాల వారీగా మద్యంతో విందును ఏర్పాటు చేస్తూ దావతులను పోటీ చేసే అభ్యర్థులు ఇస్తున్నారు. ఆదివారం ఉండడంతో మున్సిపల్ ఎన్నికకు సమయం దగ్గర పడడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను నయానో భయాన్ని మచ్చిక చేసుకునేందుకు కిలో చొప్పున మటన్ చికెన్ ప్యాకెట్లను వారి మద్దతుదారులు, అనుచర ద్వారా ఓటర్ల ఇంటికి పార్సిల్ చేస్తున్నారు. పురుష ఓటర్లకు మద్యంతో విందు దావతులను ఏర్పాటు చేయడంతో పాటు మహిళ ఓటర్లకు లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ లను వాయు వారి ఇళ్ల వ‌ద్ద‌కు పంపుతున్నారు. మున్సిపల్ ఎన్నికకు ఆర్మూర్ మున్సిపల్ లో మంత్రుల, ఎమ్మెల్యే, అగ్రనేతల, నియోజకవర్గ నాయకులు ప్రచారానికి వచ్చిన సందర్భంలో ప్రజల సమీకరణకు ఒక్కొక్కరికి 200 నుంచి 300 వరకు మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు అందజేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో పలు వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆదివారం ఉదయం నుంచే చికెన్ మటన్ ల పార్సలను ఇండ్లకు పంపిణీ చేయడం పట్ల ఎన్నిక జరిగే వరకు ఇంకా మూడు రోజులు ఏ స్థాయిలో ఓటర్లను మభ్య పెట్టేందుకు పోటీ చేసే అభ్యర్థులు పంపిణీ చేయనున్నారో అనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు వార్డుల్లో ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసే పలువురు ఓటర్లను మభ్యపెట్టి మచ్చిక చేసుకొనేందుకు 1500 నుంచి 4000 రూపాయల వరకు పంపిణీ చేసేందుకు నగదును సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు ఆర్మూర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Next Story