- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామీణ ప్రాంతాల ఆలయాలు ప్రజలకు దోహదపడుతాయి : డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
గ్రామీణ ప్రాంతాల ఆలయాల్లో చేపట్టే యజ్ఞాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు దోహదపడుతాయని జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.

దిశ, నిజాంసాగర్ : గ్రామీణ ప్రాంతాల ఆలయాల్లో చేపట్టే యజ్ఞాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు దోహదపడుతాయని జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. మండలంలోని మాగి గ్రామంలో మంగళవారం హనుమాన్ స్వాముల మాలాధారణ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులు మధుకర్ రావు ఆధ్వర్యంలో 41 రోజుల మాలాధారణలో ఉన్న భక్తులతో కలిసి పవిత్ర హోమం, సహస్ర సింధూర అర్చన యజ్ఞం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాయని తెలిపారు.
గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమాన్ స్వామి అనుగ్రహంతో గ్రామంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం ఆనందంగా ఉందని, ఇలాంటి వేడుకలు గ్రామ ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా.. స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేంగారం కవిత పండరి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, గుర్రపు వెంకటేశం, మేంగారం సాయిలు,మేంగారం పండరి, కమ్మరి కత్త అంజయ్య, మేంగారం శ్రీనివాస్, బంగ్లా ప్రవీణ్ కుమార్, రాజ్యం గంగారం, గ్రామస్తులు పాల్గొన్నారు.






