రాష్ట్రస్థాయి క్రీడల్లో నిజామాబాద్ జిల్లా "భవిత" విద్యార్థుల ప్రతిభ

by Ratna Kumari |

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన చిన్నారులు ప్రతిభ చాటారు.

రాష్ట్రస్థాయి క్రీడల్లో నిజామాబాద్ జిల్లా భవిత విద్యార్థుల ప్రతిభ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన చిన్నారులు ప్రతిభ చాటారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ని ఆమె ఛాంబర్ లో కలిసి, రాష్ట్ర స్థాయి పోటీలలో సాధించిన మెడల్స్, బహుమతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులను పేరుపేరున అభినందిస్తూ, వారితో ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. భవిత కేంద్రాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్చిదిద్దిన ఐ.ఆర్.పీలు, ఇతర అధికారులను కూడా అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సాధారణ విద్యార్థులకు సమానంగా భవిత కేంద్రాలలో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం అందించబడతాయని అన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో డీఈఓ అశోక్ ఉన్నారు.

Next Story