- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : MLC బల్మూరి వెంకట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. గురువారం నిజాబాద్ కాంగ్రెస్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. గురువారం నిజాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ విషయం పై సీపీ పోతరాజు సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫ్రీడం అప్ స్పీచ్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి పై మంత్రులు, ఉన్నతాధికారులపై అడ్డగోలుగా, ఇష్టారీతిన చేస్తున్న పోస్టులు శృతి మించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత పోస్టింగులతో తప్పుడు ప్రచారం చేయడం పై తెలంగాణ అంతటా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, యువత మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. సీఎం రేవంత్ గురించి మాట్లాడిన మాటలపై అట్టుడుకుతున్నారని, వారంతా ఆవేశంతో రోడ్లపైకి వచ్చే అవకాశముందన్నారు. ఈ విషయంపై నిజామాబాద్ సీపీ కి కూడా ఫిర్యాదు చేశామని బల్మూరి అన్నారు. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు పోస్టింగ్ చేసిన బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంపూర్ణ బాధ్యత వహించాలన్నారు. కేటీఆర్ పై కఠిన సెక్షన్లు పెట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరుతున్నామన్నారు. సీఎంపై చేసిన పోస్టులపై పోలీసు శాఖ రియాక్ట్ కాకపోతే, కేటీఆర్ పై చర్యలు తీసుకోకపోతే తెలంగాణలోని యువతను ఆపే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. కేటీఆర్ పైన దాడులకు దిగే పరిస్థితి కూడా ఉంటుందని ఎమ్మెల్‌సీ బల్మూరి హెచ్చరించారు. సీఎం రేవంత్ పై అనవసరంగా వ్యతిరేక ప్రచారాలకు దిగితే సహించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదన్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన అవసరముందన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, నాయకులు తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.






