వీధి కుక్క కాటు.. భ‌యాందోళ‌నలో ప్ర‌జ‌లు

by Ratna Kumari |

దిశ‌, న‌వీపేట్ : కుక్క కాటు మరణాల పై సుప్రీంకోర్టు కోర్టు హెచ్చరించిన అధికారులతో ఎలాంటి చలనం లేదు. వీధి కుక్కలను జనాలు తిరిగే ప్రాంతాల నుంచి తరలించాలని,

వీధి కుక్క కాటు.. భ‌యాందోళ‌నలో ప్ర‌జ‌లు
X

దిశ‌, న‌వీపేట్ : కుక్క కాటు మరణాల పై సుప్రీంకోర్టు కోర్టు హెచ్చరించిన అధికారులతో ఎలాంటి చలనం లేదు. వీధి కుక్కలను జనాలు తిరిగే ప్రాంతాల నుంచి తరలించాలని, విద్యా సంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్ లలో రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, వీధి కుక్కల కాటుకు జంతువులు, పిల్లలు బలి అవుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసిన గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా గుంపులుగుంపులుగా తిరుగుతూ రోడ్లపై కనబడిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ప్రతి శనివారం నవీపేట మండల కేంద్రంలో జరిగే మేకల సంతలో మేకల కాపలా కోసం తీసుకువచ్చే కుక్కలను మేకల విక్రయం అనంతరం ఇక్కడే వదిలేసి వెళ్తుండడంతో వాటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

వీధి కుక్కలు సమూహాలుగా ఏర్పడి ఆయా వీధుల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మహిళలు, చిన్నారులు రోడ్లపైకి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. చివరకు పాఠశాలలకు సైతం వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతుండడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట బెట్టుకుని బడులకు తీసుకెళ్తున్నారు. తరుచూ కుక్కకాటు సంఘటనలు జరుగుతున్నప్పటికీ, అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. మాంసం విక్రయాలు జరిగే ప్రాంతాల్లోనైతే కుక్కల బెడద మరింత ఎక్కు వగా ఉంటోంది. సంతలలో ఆయా వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి కూడా కుక్కల బెడదను ఎదుర్కోక తప్పడం లేదు. సాధారణ సమయాల్లోనూ ఏదో ఒక చోట కుక్కలు దాడి చేసి ప్రజలతో పాటు చిన్నారులను గాయపరు స్తున్నా, నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీధుల్లో, రోడ్లపై పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు.

నివాస ప్రాంతాల్లో ప్రజలు కుక్కల బెడదకు జంకాల్సి వస్తోంది. ఈ మధ్యనే బాన్సువాడ లో కుక్కల కాటు కు ప్రజలు గాయపడిన సంగతి విదితమే. నవీపేట్ మండలం రైల్వే స్టేషన్ ఏరియా లో 6 సంవత్సరాల బాలుడికి కుక్క గాయపరిచింది. కుక్కల బెడదలపై స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, నివారణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం పెంపుడు కుక్కను పెంచుకోవాలన్నా స్థానిక గ్రామ పంచాయతీ నుండి అనుమతి తీసుకో వాల్సి ఉంటుంది. అయితే పెంచుకునే కుక్కలకు యజమాని క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది. దీంతో అవి అనుకోకుండా ఎవరినైనా కరిచి గాయప ర్చినా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ, అటు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ భయపెట్టిస్తున్నాయి. గ్రామ సింహాలు కరవడంతో పశువులు కూడా మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసు కుంటున్నాయి. రెంజల్ మండల కేంద్రంలో ఇటీవల రేబిస్ వ్యాధితో లేగదూడ మరణించింది.

ప్ర‌ధానంగా నవీపేట్ మండలం లో ఆగస్టు నెలలో 49, సెప్టెంబర్ లో 42, అక్టోబర్ లో 56 కుక్క కాట్లు కేసులు నమోదు అయ్యాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఎక్కువ డాగ్ బైట్ కేసులు నమోదు అయ్యే గ్రామ సెక్రెటరీ కి సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సిఫార్సు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి సుప్రీంకోర్టు ఆదేశానుసారం కుక్కల బెడద నుంచి తమను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story