- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ ఫోన్ పోయిందా..ఇక బేఫికర్!
జిల్లాలో ప్రతి నెలా సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే రూ.40లక్షల విలువైన 250ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మొబైల్ ఫోన్ పోయిందా..ఇక బేఫికర్!
రికవరీలో జిల్లా పోలీసుల సరికొత్త రికార్డు
రూ.7.25కోట్ల విలువైన 4,531ఫోన్లు స్వాధీనం
సీఈఐఆర్ వ్యవస్థతో బాధితులకు భరోసా
ప్రతి నెలా 100కు పైగా మొబైల్స్ స్వాధీనం..
రికవరీ కోసం ఆర్ఎస్ఐ నేతృత్వంలో ప్రత్యేక బృందాల నియామకం
ఈ నెలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.20లక్షల విలువైన 123 ఫోన్ల రికవరీ
కామారెడ్డి జిల్లా పోలీసులు సాంకేతికతను జోడించి మొబైల్ ఫోన్ల రికవరీలో దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపును సాధించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.7.25కోట్ల విలువైన 4,531 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించి భరోసా కల్పించారు. ప్రతి నెలా సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ రికార్డు స్థాయి పనితీరును కనబరుస్తున్నారు. మొబైల్ రికవరీ కోసం ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా ఒక ఆర్ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు రూ.40లక్షల విలువైన 250 ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం విశేషం. జిల్లా పోలీసుల అంకితభావానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు కురిపించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేసి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచిస్తున్నారు.
దిశ, కామారెడ్డి : సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి జిల్లా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థ ద్వారా పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.7.25కోట్ల విలువైన 4,531మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ అద్భుత పనితీరుతో ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల్లో పోలీసులు భరోసా నింపుతున్నారు.
రికవరీ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు
జిల్లాలో ప్రతి నెలా సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే రూ.40లక్షల విలువైన 250ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రూ.20లక్షల విలువైన 123 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం గమనార్హం. దీని కోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం ఫోన్లను ట్రాక్ చేస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే కామారెడ్డి పోలీసుల పనితీరును డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు.
సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలి
- రాజేష్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణం. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సాంకేతిక నైపుణ్యంతో ట్రాకింగ్ చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు, సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సేవలను వినియోగించుకోవాలి.






