పైన మెరుగు... లోపల పురుగు... అసెంబ్లీ స్పీకరొచ్చి వార్నింగ్ ఇచ్చినా మారని వైనం

by Dishanational1 |
పైన మెరుగు... లోపల పురుగు... అసెంబ్లీ స్పీకరొచ్చి వార్నింగ్ ఇచ్చినా మారని వైనం
X

దిశ, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో మండల ప్రజల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన ప్రాథమిక దవాఖాన కేవలం అలంకారం మాదిరిగా భావనానికి రంగులు వేసి లోపల మాత్రం ఎవరు లేకుండా వచ్చిన రోగులకు వైద్యం సరిగా చేయకుండా కేవలం మందు బిళ్ళలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఒక సందర్భంలో డాక్టర్ లేదంటూ బుకాయించిన దాఖలాలు సైతం ఉన్నాయి. దవాఖానకు రావాల్సిన ఇంచార్జి డాక్టర్ సైతం రాక ఓ పి ని సబ్ సెంటర్ వైద్యురాలు వైశాలి పనులు చూడడం కనపడింది. అదేవిధంగా దవాఖాన లో ఆమెతో పాటు ఒక స్టాఫ్ నర్సు, ఒక ఆశ కార్యకర్త తప్ప ఎవ్వరు లేకపోవడం గమనార్హం. ఇక అసలు విషయానికి వస్తే దవాఖానకు వచ్చే రోగులకు మందులు అందివ్వాల్సిన ఫార్మసిస్ట్ సైతం పట్టలేకపోవడం విచారకరం.

ఆయన దవాఖానలో ఉన్న సిబ్బందికి కావాల్సిన మందులను అదనంగా ఇచ్చేసి తన ఇష్టం వచ్చినప్పుడు దవాఖానకు వస్తాడన్న విమర్శలు మండలంలో గతంలోనే ఉన్నాయి. ఇకపోతే కంప్యూటర్ ఆపరేటర్ కూడా యథా రాజా తథా ప్రజ అన్నవిధంగానే వ్యవహారిస్తాడని మండల ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ దవాఖానకు శాశ్వత డాక్టర్ లేక మండల ప్రజలు పడ్డ ఇబ్బంది, ఇప్పటికి పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. దవాఖానలో శాశ్వత డాక్టర్ లేకపోవడంతో సిబ్బంది వ్యవహారం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయ్యింది. ఇటీవల ఈ దవాఖానను రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, జిల్లా వైద్యాధికారి వచ్చే వరకు వేచి ఉండి మొదటిసారిగా హెచ్చరించారు. తదనంతరం మరొక రోజు జిల్లా వైద్యాధికారి సైతం తనిఖీ చేసి సక్రమంగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

అయినప్పటికీ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బందిలో మార్పు రాకపోవడం గమనార్హం. బాధ్యతగా ఉండే సీ హెచ్ వో రవీందర్, సూపర్ వైజర్లు సైతం సమయ పాలన పాటించకపోవడం విచారకరం. తెల్లవారితే పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద, పిట్లం మండలాలకు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వస్తున్నప్పటికీ సిబ్బంది ఇంతగా నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుని ప్రజల కోసం పని చేసే సిబ్బందిని నియమించి తమకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయమై ఇంచార్జి వైద్యురాలు వైశాలిని వివరణ కోరగా పొంతన లేని సమాధానం ఇవ్వడం, దవాఖానకు రాని వైద్య సిబ్బంది మరో రకంగా సమాధానం చెప్పడం విషయం.


Next Story

Most Viewed