- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దుల గుట్ట పై ప్రత్యేక పూజలు
by Ratna Kumari |
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై ఉన్న శివాలయంలో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై ఉన్న శివాలయంలో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దుల గుట్ట పై ఉన్న రామాలయం ప్రక్కన గల కోనేరు నుంచి గుట్ట పైన గల పలు ఆలయాలకు స్వామివారి పల్లకి సేవను భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు భజన మండలి సభ్యులు భజనలతో వైభవోపేతంగా నిర్వహించారు. సోమవారం, జనవరి 26 సెలవు దినం కావడంతో సిద్దులగుట్ట పై గల ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో ఆలయం పైన భక్తుల సందడి నెలకొంది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పిసి గంగారెడ్డి, కొడిగేల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మీ సంధ్యా రవి, కొంతం మంజుల మురళి, బోండ్ల సంతోష్ పాల్గొన్నారు.
Next Story






