- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీలు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్టీసీడిపోలో పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని ఇస్తున్నట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ కె .కవిత తెలిపారు.

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్టీసీడిపోలో పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని ఇస్తున్నట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ కె .కవిత తెలిపారు. శనివారం ఆర్మూర్ ఆర్టీసీ డిపోమేనేజర్ కే.కవిత దిశతో మాట్లాడారు. అన్ని రకాల బస్ సర్వీస్ లపై 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఈ ఏడాది జూన్30 వరకు అద్దెబస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందన్నారు. అద్దె బస్సు బుకింగ్ కోసం తమ అధికారిక వెబ్. సైట్. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు టీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్.ఇన్ ను సందర్శించాలని ఆమె కోరారు. మరిన్ని పూర్తివివరాల కోసం ఆర్మూర్ డిపోపరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు ఆర్మూర్ ఆర్టీసీ డిపోను సంప్రదించాలని ఆమె సూచించారు. శుభకార్యాలకు పెండ్లిలకు తమ అద్దె బస్సు లను సద్వినియోగం చేసుకొని టీఎస్ ఆర్టీసీని ప్రోత్సహించాలని ఆర్మూర్ డిపో మేనేజర్ కె. కవిత ప్రజలను కోరారు.






