సోయాబీన్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

by Ratna Kumari |

దిశ, నిజాంసాగర్ : సోయాబీన్ పంట పండించిన రైతులు తొందరపడి తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

సోయాబీన్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
X

దిశ, నిజాంసాగర్ : సోయాబీన్ పంట పండించిన రైతులు తొందరపడి తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రైతులకు భరోసా కల్పించారు. శనివారం సోయాబీన్ దాన్యం కొనుగోళ్ల విషయంపై రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మార గంగారెడ్డి తో చరవాణిలో మాట్లాడారు. సోయాబీన్ పంట పండించిన రైతుల వద్ద నుండి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, సోయాబీన్ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని రైతులకు భరోసా కల్పించారు. వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపడుతామని ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. రైతులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని ఎమ్మెల్యే ఢిల్లీలోని నాఫెడ్ అధికారులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోతే, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తానని ఎమ్మెల్యే సోయా రైతులకు తెలిపారు. రైతులు ఎవ్వరూ తొందరపడొద్దని, దళారుల మాటలు నమ్మి మోస పోవద్దని ఎమ్మెల్యే రైతులకు విజ్ఞప్తి చేశారు.

Next Story