- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్మార్ట్’ ప్రచారం.. పురపోరులో సామాజిక మాధ్యమాలకు ప్రాధాన్యం
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగాక యూజర్లు సోషల్ మీడియాతో గడిపే సమయం కూడా పెరుగుతూ వస్తోంది.

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగాక యూజర్లు సోషల్ మీడియాతో గడిపే సమయం కూడా పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉంది. ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ఫోన్లు వాడటం కారణం. దీంతో పార్టీలు, నేతలకు సామాజిక మాధ్యమాల గురించి ప్రత్యేక ప్రచార వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సామాజిక మాధ్యమాలు రణభూమిలా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలక పాత్రను పోషించనున్నాయి. తక్కువ సమయంలో ఎక్కవ ప్రచారానికి అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే పూర్తిగా సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే దాదాపు అన్నిపార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన తర్వాత కోడ్ అమలులోకి రావడంతో ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృత స్థాయిలో పరోక్ష ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగి స్తున్నారు. ఇవి అభ్యర్థులు, నేతల పేరుతో కాకుండా వారి మద్దతుదారులు, అభిమానుల పేర్లతో చెలా మణి అవుతున్నాయి. వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యర్థించే పనిలో పడ్డారు.
దిశ, కామారెడ్డి :
ఒకప్పుడు మైక్ సెట్ లలో పాటల రూపంలో చెబుతూ గల్లీలో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేసేవారు... కానీ ప్రస్తుతం ట్రెండు మారింది. అభ్యర్థులు స్మార్ట్ గా సెల్ ఫోన్ ద్వారా ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ ఒక ప్రచారాస్త్రంగా మారింది. బీ-ఫామ్ లు ఖరారు కావడంతో సెల్ఫోన్ వేదికగా ప్ర చార జోరు ఊపందుకుంది. అభ్య ర్థులు ప్రత్యక్ష ప్రచారానికే పరిమితం కాకుండా డిజిటల్ ప్రచారానికి పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మార్చు కుని స్మార్ట్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు. వా ట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలపై ప్రచార వీడియోలు, పోస్టర్లు, వాయిస్ మేసేజ్లతో ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే చేపట్ట బోయే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక వీడియోలు రూపోందించి సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరవేస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక అవగాహన ఉన్న యువ కులను ఉపయోగించు కుంటున్నారు.
తక్కువ ఖర్చుతో..ఎక్కువ ప్రచారం...
డిజిటల్ ప్రచారానికి ఖర్చు తక్కువ కావడంతో పాటు ఎక్కువ మంది ఓటర్లను చేరుకునే అవకాశం లభిస్తుంది. దీంతో అభ్యర్థులు డిజిటల్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉండడం ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా మారింది. కంప్యూటర్, మొబైల్ సాయంతో రూపొందించిన సందేశాలను ఒకేసారి వేలాది మందికి పంపించే అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అభ్యర్థులు వార్డుల వారీగా ఓటర్ల వివరాలు, ఫోన్ నంబర్లును సేకరిస్తూ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు వారి సందేశాలు, వీడియో లను గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు వాయిస్ కాల్స్, లైవ్ వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు.






