మార్వాడీలతో చిరు వ్యాపారులకు నష్టమే

by velandi.Saikiran |

మార్వాడీలు, గుజరాతీలతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఎంసీపీఐ (యు) పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ ఫైర్ అయ్యారు.

మార్వాడీలతో చిరు వ్యాపారులకు నష్టమే
X

దిశ, కామారెడ్డి : మార్వాడీలు, గుజరాతీలతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఎంసీపీఐ (యు) పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ ఫైర్ అయ్యారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎం సిపిఐయు జిల్లా ఆఫీసులో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏ వస్తువు కొనాలన్నా మార్వాడి, గుజరాతీల దుకాణాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో స్థానిక ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మార్వాడీలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు బాల్ సింగ్ నాయక్, ఒడ్డె నర్సింలు, సదానందం, వడ్ల రమేష్, గంగయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Next Story